HomeTelugu Trendingవెబ్‌ సిరీస్‌లో నటించనున్న సమంత!

వెబ్‌ సిరీస్‌లో నటించనున్న సమంత!

2 12ప్రముఖ నటి సమంత టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది. తాజాగా ‘ఓ బేబీ’ తో మంచి విజయం అందుకుంది. ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా సమంత వెబ్‌ సిరీస్‌లో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఓ బేబీ’ విజయం తర్వాత సమంత ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్‌ చెన్నైలో జరుగుతోందట. అందులో సమంత పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ వెబ్‌ సిరీస్ ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై సమంత ఇంత వరకూ స్పందించలేదు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu