HomeTelugu Trendingఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీలో గ్లోబల్‌ బ్యూటీ!

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీలో గ్లోబల్‌ బ్యూటీ!

Priyanka Chopra in NTR Pras
టాలీవుడ్ స్టార్‌ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే కొరటాల శివ డైరెక్షన్లో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా దీన్ని ఈ సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. తరువాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందట.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే శ్రద్దా కపూర్, ఆలియా భట్, మృణాల్ ఠాకూర్, శ్రీనిధి శెట్టి, దీపిక పదుకొనె వంటి ఎంతో మంది హీరోయిన్లు పేర్లు కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గురించి తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుందట. ఇప్పటికే ఆమెకు ప్రశాంత్ నీల్ స్టోరీని కూడా వినిపించాడని టాక్‌. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ కాంబో సెట్ అయితే మాత్రం సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తారని తెలిసింది. ఇందులో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu