HomeTelugu Trendingఓ బంగారం .. అంటున్న కిరణ్‌ అబ్బవరం

ఓ బంగారం .. అంటున్న కిరణ్‌ అబ్బవరం

Oh Bangaram Video Song Vina

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్స్ పై ఈ పాటను చిత్రీకరించారు. లవర్ వెంట పడుతూ హీరో పాడుకునే పాట ఇది.

చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో మురళీశర్మ, శుభలేఖ సుధాకర్, ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇటీవలే విడుదలైన కిరణ్‌ అబ్బవరం సినిమాలు పెద్దగా హిట్‌ కాలేదు. దీంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో కిరణ్ ఉన్నాడు.

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌తో రామ్‌ చరణ్‌ డాన్స్‌.. వైరల్‌

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu