HomeTelugu Trendingకిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా టైటిల్‌ 'వినరో భాగ్యము విష్ణు కథ'

కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా టైటిల్‌ ‘వినరో భాగ్యము విష్ణు కథ’

Kiran abbavavaram New Movie
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ని ప్రకటించారు. సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్‌ మండపం’ తో గత ఏడాది ఆగస్ట్ లో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్‌ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు వస్తున్నాయి. రెండో సినిమా విడుదలకు ముందే కిరణ్ ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అవి సెట్స్ మీద ఉండగానే ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించే తొలి చిత్రంలో ఆఫర్ అందుకున్నాడు. అలాగే నవంబర్ లో కిరణ్ అబ్బవరం హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఓ సినిమాను ప్రారంభించింది. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం ఓ మూవీ చేయబోతున్నాడు.

గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ నంబర్ 7గా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ నేడు (జనవరి 7) ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో మొదలు కాబోతోంది. ఇది కిరణ్‌ అబ్బవరంకు 7వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలో ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలను ప్రకటించనున్నారు.

క్రేజీ టైటిల్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ

Recent Articles English

Gallery

Recent Articles Telugu