
Oh Bhama Ayyo Rama Movie Review:
Oh Bhama Ayyo Rama అనే టైటిల్ వినగానే ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ వచ్చేస్తుందని అనిపిస్తుంది. కథానాయకుడిగా సుహాస్, హీరోయిన్‌గా మాళవిక మనోజ్ (ఇది ఆమె తొలి తెలుగు చిత్రం) నటించిన ఈ సినిమా జూలై 11, 2025న రిలీజ్ అయ్యింది. కానీ సినిమా చూశాక టెంపర్ మళ్లిపోతుంది!
కథ:
రామ్ (సుహాస్) సినిమాలంటే విరక్తిగా ఉంటాడు. అప్పుడు అతడి జీవితంలోకి వస్తుంది సత్యభామ (మాళవిక మనోజ్) – ధనవంతురాలు అయినా సరదాగా ఉండే అమ్మాయి. ఇద్దరి మధ్య స్లోగా ప్రేమ మొదలవుతుంది. అంతా సవ్యంగా నడుస్తున్నట్లు అనిపించిన సమయంలో, సత్యభామ ఓ షాకింగ్ షరతు పెడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే కథ.
నటీనటులు:
సుహాస్ నటన సాదారణంగానే ఉంది. గత సినిమాలతో పోలిస్తే పంచే ఇమోషన్ మిస్సయ్యింది. మాళవిక మనోజ్ మాత్రం తన టాలీవుడ్ డెబ్యూట్‌లో బాగానే ఇంప్రెస్ చేసింది. స్క్రీన్ పై గ్రేస్ ఉన్నట్టు అనిపిస్తుంది. అలీ, బబ్లు పృథ్వీరాజ్, రఘు కరుమంచి ఇలా చాలా మంది ఉన్నా వారికీ పెద్దగా స్కోప్ లేదు.
ప్లస్ పాయింట్స్:
*మాళవిక నటన డీసెంట్
*కొన్ని కామెడీ సీన్స్ ఫన్నీగా ఫీల్ అయ్యాయి
*కథలో కొన్ని ఎమోషనల్ మోమెంట్స్
మైనస్ పాయింట్స్:
– స్క్రీన్‌ప్లే చాలా స్లో
– ఎమోషన్ & కామెడీ ప్రాపర్లీ మిక్స్ కాలేదు
– సాంగ్స్ బోరింగ్, ప్లేస్‌మెంట్ డల్
– రొటీన్ క్లైమాక్స్, కొత్తదనం లేదు
– సుహాస్‌కు తగ్గ స్ట్రాంగ్ రోల్ లేదు
సాంకేతిక అంశాలు:
దర్శకుడు రామ్ గోదాల ఎమోషనల్ & కామెడీ ఎలిమెంట్స్‌ను సరైన బెలెన్స్‌లో హ్యాండిల్ చేయలేకపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సాంగ్స్ యావరేజ్ గా ఉన్నా గుర్తుండిపోవు. సినిమాటోగ్రఫీ (ఎస్. మణికందన్): విజువల్స్ ఓకే ఎడిటింగ్ (భవిన్ షా): సినిమాకి చాలా చోట్ల కట్‌లాగలేదు. నిడివి ఎక్కువగా అనిపిస్తుంది.
తీర్పు:
“ఓ భామ అయ్యో రామ” ఓ ఫీల్‌గుడ్ ప్రేమకథగా కన్విన్స్ చేయాలనుకున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ డెప్త్ లోపించడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మాళవిక మంచి ప్రయత్నం చేసినా కథలో కన్‌విక్షన్ లేకపోవడం, సుహాస్‌కు సరైన రోల్ లేని స్థితిలో సినిమా పూర్తిగా వర్కౌట్ కాలేదు.
రేటింగ్: 2.25/5












