చిరు సినిమా ఆలస్యానికి కారణం!

చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సై రా నరసింహారెడ్డి’ అనే టైటిల్ ను ఖారారు చేశారు. చిరు పుట్టినరోజు సంధర్భంగా సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ విషయంలో ఆలస్యం జరుగుతూనే ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

అది పూర్తయిన తరువాత ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకోనున్నాడు. అలానే ‘సై రా’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్, జైపూర్ లలో భారీ సెట్స్ ను నిర్మించబోతున్నారు. వాటి నిర్మాణం పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. అలానే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేయనున్న నయనతార, అమితాబ్, జగపతి, విజయ్ సేతుపతి ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వీరందరి బల్క్ డేట్స్ కావడానికి కూడా సమయం పడుతుంది. ఈ కారణాల చేతనే సినిమా షూటింగ్ లో ఆలస్యం నెలకొంది. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా వచ్చే నెల చివరి వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.