పవన్ తీరు త్రివిక్రమ్ ను బాధ పెడుతోంది!

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు.. ఇద్దరి వ్యక్తిత్వాలు కలవడంతో వీరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. అయితే పవన్ కల్యాణ్ తీరు మాత్రం ఇప్పుడు త్రివిక్రమ్ ను బాధ పెడుతోందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు పెద్ద హిట్స్ ను సాధించాయి.
త్వరలోనే మరో సినిమా కూడా చేయబోతున్నారు. ఈ సినిమా అందరి అంచనాలను మించే విధంగా రూపొందించాలనేది త్రివిక్రమ్ ప్లాన్. కానీ పవన్ వైఖరిని చూస్తుంటే ఆ పని సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

పవన్ తన రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమాలపై దృష్టి తగ్గించాడు. దీని కారణంగానే ‘సర్ధార్’ సినిమా షూటింగ్ బాగా లేట్ చేశారు. ఇప్పుడు కాటమరాయుడు సినిమా షూటింగ్ కూడా బాగా డిలే అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సింది కానీ కాలేదు. త్రివిక్రమ్ సినిమా కోసం పవన్ కల్యాణ్ బల్క్ డేట్స్ కేటాయించాల్సివుంది.

మరి ఇప్పుడు పవన్ ఉన్న కండీషన్స్ లో తన సినిమాపై ఫోకస్ పెట్టగలడా..? అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయగలనా..? అనే ప్రశ్నలు త్రివిక్రమ్ కు కలుగుతున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో… చూడాలి!