HomeTelugu Trendingశర్వానంద్‌ 'ఒకే ఒక జీవితం' టీజర్‌

శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’ టీజర్‌

Oke Oka Jeevitham Teaser
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ శ్రీ కార్తీక్‌ కాంబినేషన్‌ వస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. అమల అక్కినేని, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య బుధవారం విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టైమ్‌ మెషీన్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. స్నేహితులైన శర్వానంద్‌, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌ భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి రావటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తల్లీకొడుకుల అనుబంధం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. శర్వానంద్‌ కూల్‌ లుక్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రాన్ని ఎస్‌. ఆర్‌. ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదలకానుంది. ఈ సినిమాకి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu