HomeTelugu Trendingఫన్నీగా 'ఓం భీమ్ బుష్' టీజర్‌

ఫన్నీగా ‘ఓం భీమ్ బుష్’ టీజర్‌

Om Bheem Bush Teaser

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదలైంది.

అయితే ఈటీజర్‌లో ప్రతి సీన్‌లోనూ కామెడీగా ఉంది. ఫన్‌తో పాటు హారర్‌ను కూడా జోడించి ఇంట్రెస్టింగ్‌గా టీజర్‌ను కట్ చేశారు. ఇక టీజర్‌లో లాస్ట్ సీన్ మాత్రం వేరే లెవల్‌లో ఉంది. సాధారణంగానే శ్రీ విష్ణుకి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు తనకి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడవ్వడంతో మరో రేంజ్‌లో పంచులు పేలాయి. వరుస సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా శ్రీవిష్ణుకి హిట్‌ ఇస్తుంది అనిపిస్తుంది.

ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ సమర్పణలో V సెల్యులాయిడ్, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ ఎమ్ ఆర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఓం భీమ్ బుష్ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!