HomeTelugu Newsఆపరేషన్ వాలెంటైన్ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే

ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే

Operation Valentine new Rమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ విడుదలైన అప్డేట్స్‌ అన్నీ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి.

కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. తాజాగా ఈ వార్తను కన్ఫర్మ్‌ చేస్తూ.. న్యూ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.

ఈమూవీ మార్చి1 న తెలుగు, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి రానున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రెనైసెన్సే పిక్చర్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu