HomeTelugu Big StoriesOperation Valentine: ఏం జరిగినా సరే చూసుకుందాం అంటున్న వరుణ్‌

Operation Valentine: ఏం జరిగినా సరే చూసుకుందాం అంటున్న వరుణ్‌

 

Operation Valentine Traile
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. గతకొంతకాలంగా సరైన హిట్‌లేని వరుణ్‌.. ఈ సినిమాపై హోప్స్‌ పెట్టుకున్నాడు.

ఈక్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. గని, గాండివధారి అర్జున వంటి డిఫరెంట్‌ సినిమాలు చేసిన వరుణ్‌ పెద్దగా కలిసి రాలేదు. అయినా కూడా తన ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు వరుణ్‌. ఈ క్రమంలో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది.

తెలుగులో ఈ మూవీ ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ వరుణ్ తేజ్ మీద ప్రశంసలు కురిపించాడు. ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ గర్వించేలా చేస్తుంటావ్.. ఈ సారి ఇండియా అంతా గర్వపడే సినిమా చేశావ్ అంటూ ట్రైలర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

ఈ ట్రైలర్‌ హై డోసేజ్ యాక్షన్‌, మానుషి జంటగా నటిస్తున్న, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకుంటోంది.శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం ఈ సినిమాలో.. రుద్రగా ఓ పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ కనిపించాడు. అతని హైట్, పర్సనాలిటీ ఈ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయాడు.

పైనుంచి వచ్చే ఆర్డర్లను ఫాలో కాకుండా మొండిగా డేంజరస్ ఆపరేషన్లకు వెళ్లే పాత్ర. రుహానీ శర్మకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా ఇందులో కనిపించింది. ఇద్దరూ కలిసి గాల్లో చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. లవ్, యాక్షన్‌, దేశభక్తి అన్నీ కలగలిపిన ఈ ట్రైలర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. చివర్లో వరుణ్ నడిపే ఎయిర్ క్రాఫ్ట్ కు మంటలు అంటుకోవడం, దాని నుంచి అతడు బయటపడటానికి చేసే ప్రయత్నంతో ట్రైలర్ ముగుస్తుంది. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఈ సారి వరుణ్‌ ప్రయోగం ఫలించేలా ఉంది. మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu