ఆ డైరెక్టర్ తో విశాల్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్..!

లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్ ఇప్పుడు విశాల్ హీరోగా
మరో సినిమా చేయనున్నాడు. విశాల్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా
బీ,సీ ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజే వేరు. తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు.
ఈ నేపధ్యంలో ఆయనొక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు.
ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. శ్రీవాస్, విశాల్ ను కలిసి కథ చెప్పడం దానికి ఆయన ఓకే చెప్పడం
జరిగిపోయాయి. జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగు, తమిళ బాషల్లో రూపొందుతోన్న
ఈ చిత్రం తెలుగు వెర్షన్ కోసం ఇక్కడి నటీనటులతో, అలానే తమిళ వెర్షన్ కోసం అక్కడి నటులతో
సినిమాను రూపొందిస్తున్నారు. విశాల్ కు తగ్గట్లుగానే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ లవ్ స్టోరీ
అని తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates