HomeTelugu TrendingOTT : ఈవారం సందడి చేయనున్న సినిమాలు.. ఏంటంటే!

OTT : ఈవారం సందడి చేయనున్న సినిమాలు.. ఏంటంటే!

OTT releases in this week

OTT : ఓటీటీలో ఈ వారం పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 మధ్య వివిధ ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. వీటిలో వివిధ భాషలకు చెందిన వాటితో పాటు తెలుగులో హిటైన సినిమాలు.. భీమా, లంబసింగిలాంటివి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

లంబసింగి – హాట్‌స్టార్
లుగు ‘బిగ్ బాస్’ బ్యూటీ దివి నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ మంగళవారం (ఏప్రిల్ 2) నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్.. నక్సలైట్ కూతురిపై మనసు పారేసుకునే ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన సినిమా.

భీమా – హాట్‌స్టార్
గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా గత నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. మిక్సిడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ నెలలోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

హనుమాన్ – హాట్‌స్టార్
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ డైరెక్షణ్‌లో వచ్చిన హనుమాన్ మూవీ ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ వెర్షన్లు జీ5, జియో సినిమాల్లో ఉండగా.. మిగిలిన కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్లు శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి హాట్‌స్టార్ లోకి రాబోతున్నాయి.

ఫారీ – జీ5
గతేడాది థియేటర్లలో రిలీజైన మూవీ ఫారీ. ఇప్పుడీ సినిమా జీ5 ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఫారీ స్ట్రీమింగ్ కానుంది. స్కూల్లో చీటింగ్ రాకెట్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా మంచి థ్రిల్ పంచనుంది.

ఫ్యామిలీ ఆజ్ కల్ – సోనీలివ్
ఈ వెబ్ సిరీస్.. బుధవారం (ఏప్రిల్ 3) నుంచే సోనీలివ్ ఓటీటీలోకి రానుంది. ఓ ట్యాక్సీ డ్రైవర్ ను ప్రేమించే మధ్య తరగతి యువతి, ఆమె ఫ్యామిలీ చుట్టూ తిరిగే సరదా కథ ఇది.

యే మేరే ఫ్యామిలీ 3 – మినీ టీవీ
యే మేరే ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండు సీజన్లు ఐఎండీబీలో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ రాబోతోంది. ఈ కొత్త సీజన్ గురువారం (ఏప్రిల్ 4) నుంచి అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సీజన్ కూడా నవ్వులను పంచనుంది.

పారాసైట్ ద గ్రే – నెట్‌ఫ్లిక్స్
ఈ కొత్త సిరీస్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కానుంది. హిటోషి ఇవాకీ కామిక్ పారాసైట్ ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో ఇదే కాకుండా స్కూప్, క్రూక్స్, హనీమూనిష్ లాంటి మూవీస్ కూడా రాబోతున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu