గీత గోవింద్‌ డైరెక్టర్‌తో మరోసారి విజయ్‌ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆయన ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ క్రమంలో మరో చిత్రానికి విజయ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తదుపరి ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడు. గీత గోవిందం తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. గీత గోవిందం విజయ్‌ దేవరకొండకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో సినిమాపై సహజంగానే అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ ఆదివారం ప్రకటించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది గీత గోవిందంకు సీక్వెల్ కాదని, తాజా స్క్రిప్ట్ తోనే ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు. పెద్ద బడ్జెట్ తోనే ఈ సినిమాని తీయనున్నట్టు తెలుస్తోందినటిస్తోంది.

గతేడాది పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన ‘లైగర్’ బాక్సాఫీసు వద్ద అంచనాలను అందుకోని విషయం తెలిసిందే. దీంతో కొంతకాలం బ్రేక్‌ తీసుకున్న విజయ్‌ ప్రస్తుతం వరుస సినిమాల చేస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates