
OTT releases this week:
ఫిబ్రవరి మొదటి వారం వచ్చేసింది! కొత్తగా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు మన ఇంట్లోనే కూర్చొని చూడడానికి సిద్ధంగా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి నెట్‌ఫ్లిక్స్ వరకు, అన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ విడుదలైంది. ఇవిగో ఈ వారం మనం చూడాల్సిన లిస్ట్!
Amazon Prime Video:
Baby John (హిందీ – రెంటల్) – ఫిబ్రవరి 5
Game Changer (తెలుగు మూవీ) – ఫిబ్రవరి 7
The Mehta Boys (హిందీ మూవీ – తెలుగు డబ్) – ఫిబ్రవరి 7
Disney+ Hotstar:
Kobali (తెలుగు వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 4
Sony LIV:
Bada Naam Karenge (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 7
ZEE5:
Mrs. (హిందీ మూవీ) – ఫిబ్రవరి 7
Netflix:
The Greatest Rivalry: India vs Pakistan (హిందీ వెబ్ సిరీస్ – తెలుగు డబ్) – ఫిబ్రవరి 7
ఈ వారం ‘Game Changer’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 7న స్ట్రీమింగ్‌కు వస్తోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా గురించి థియేటర్లలోనే చాలామంది మాట్లాడుకున్నా, ఇప్పుడు ఓటీటీలో మరింత మంది వీక్షించే అవకాశం ఉందా లేదా చూడాలి.
‘Kobali’ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ఇది థ్రిల్లింగ్ స్టోరీతో వస్తోంది, క్రైమ్ & మిస్టరీ జానర్‌కు మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. అలాగే, ‘The Greatest Rivalry: India vs Pakistan’ అనే వెబ్ సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్‌కు స్పెషల్. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ యుద్ధాలను దగ్గరగా చూపించబోతున్నారు.