HomeTelugu Trendingఈ చిన్నాచితక గాళ్లకు పాన్ ఇండియా అవసరమా !!

ఈ చిన్నాచితక గాళ్లకు పాన్ ఇండియా అవసరమా !!

Pan India Stars in Telugu Film Industry
మహేష్ బాబు – త్రివిక్రమ్ టార్గెట్ ఇప్పుడు పాన్ ఇండియానే. తమ సినిమాకి పాన్ ఇండియా సినిమా బ్రాండ్ వేసేసుకుని.. నాలుగు భాషల్లో ఎలాగోలా డబ్ కొట్టేసి.. ఇక సినిమా వదిలితే చాలు..  ఓటీటీ, ఓవర్సీస్, శాటిలైట్ హక్కుల పేరిట థియేటర్ ఆదాయానికి అదనంగా బోలెడంత డబ్బు వరదలా వచ్చిపడుతోంది అని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ కి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. కానీ, ఇప్పుడు మహేష్ బాబు నుంచి విశ్వక్ సేన్ వరకూ.. అందరూ పాన్ ఇండియా వీరులే కదా.
త్రివిక్రమ్- మహేష్ సినిమా వచ్చే సరికి అసలు పాన్ ఇండియా పరిస్థుతులు ఎలా ఉంటాయి ? అనేది పెద్ద డౌట్ గా మారింది.  ఏదో శంకర్ రోబో 2 పుణ్యమా అని, అలాగే  రాజమౌళి పుణ్యమా అని బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు పాన్ ఇండియా రేంజులో బాగా క్లిక్ అయ్యాయి.
నిజంగానే బాలీవుడ్ లో రోబో 2, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఊహించనంత డబ్బు చేశాయి.
పైగా ఆ చిత్ర కథానాయకులు ప్రభాస్,  ఎన్టీఆర్ – చరణ్ లకు ఘనమైన పాపులారిటీ దక్కింది. ఇప్పుడు నాటు నాటు తో ఆస్కార్ దుమ్ము దులిపేలా ఉంది. ఇదంతా పాన్ ఇండియా అనే నాణేనికి ఓ వైపు. మరి రెండో వైపు ఏమిటో తెలుసా ?, నార్త్ లో  ప్రమోషన్స్ కోసం మనోళ్లు ఖర్చు పెట్టే డబ్బులు కూడా రావు అని టాక్. ఆ మధ్య చాలా పాన్ ఇండియా సినిమాలు పూర్తిగా బకెట్ తన్నేశాయి. రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా చేసిన మైఖేల్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
పాన్ ఇండియా వైడ్ గా సందీప్ కిషన్ తన మైఖేల్ సినిమాను రిలీజ్ చేస్తే.. పోస్టర్ల డబ్బులు రాలేదు. అంతెందుకు ప్రభాస్ రాదేశ్యామ్ సినిమా పాన్ ఇండియా రేంజులో ప్రతిచోటా క్లిక్కయింది అంటూ ఓ రేంజ్ లో హడావుడి చేశారు. అందుకు తగ్గట్టుగానే  ప్రత్యేకించి పుష్పలో సీన్లు, పాటలు హిందీలో ఎక్కువ పాపులరయ్యాయి. అయితే వాటి కోసం భారీగా ఖర్చు పెట్టారు. క్రికెటర్ల చేత పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేయించారు. కానీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేదు.
ప్రభాస్ పరిస్థితే ఇలా ఉంటే..ఇక నాని, విశ్వక్ సేన్ లాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ?. నాని దసరా సినిమా దర్శకుడు కొత్త డైరెక్టర్. పైగా ఇదొక ఫుల్ యాక్షన్ సినిమా. గతంలో నాని చేసిన యాక్షన్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేశాయి. దీనికి తోడు ఇది పాన్ ఇండియా సినిమా. లోకల్ మార్కెట్ లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన హిస్టరీ కూడా నానికి లేదు. ఇలాంటి నేపథ్యంలో పాన్ ఇండియా అవసరమా. ఇక విశ్వక్ సేన్ దమ్కీ సినిమా పరిస్థితి కూడా ఇదే. అయినా.. ఈ చిన్నాచితక హీరోలకు పాన్ ఇండియా అవసరమా !!

Recent Articles English

Gallery

Recent Articles Telugu