బిగ్ బాస్ 3.. ఎలిమినేట్ కావడం నాకు బాధేసింది: పరుచూరి గోపాలకృష్ణ

పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో, ‘బిగ్ బాస్ 3’ నుంచి మొదటివారంలో ఎలిమినేట్ అయిన ‘హేమ’ గురించి మాట్లాడారు. “హేమకి 14 .. 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచి మాకు తెలుసు. ఆ అమ్మాయి చక్కదనం చూసి హీరోయిన్ అవుతుందని అనుకున్నాము. కానీ ఆ అమ్మాయి మంచి కమెడియన్ అయింది. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందంతో పోటీపడి నటించింది. హేమ ఒకానొక సమయంలో మహిళల తరఫున పోరాడటానికి కూడా సిద్ధపడింది.

అలాంటి హేమ ‘బిగ్ బాస్ 3’ నుంచి మొదటివారంలోనే ఎలిమినేట్ కావడం నాకు బాధేసింది. మొదటివారంలో ఎలిమినేషన్ ప్రక్రియ లేకపోతే బాగుండుననిపించింది. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నాలుగైదు రోజుల సమయం సరిపోదు. మొదటివారంలో ఎవరెవరు ఏ పొరపాట్లు చేస్తున్నారనేది అర్థమయ్యేలా చెప్పేసి .. ఒక హెచ్చరిక చేసేసి, ఆ తరువాత వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ పెడితే బాగుండేది” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.