HomeTelugu Trendingఆర్జీవీ కి కౌంటర్‌గా 'పరాన్నజీవి' ఫస్ట్‌లుక్

ఆర్జీవీ కి కౌంటర్‌గా ‘పరాన్నజీవి’ ఫస్ట్‌లుక్

Parannajeevi first lookరామ్ గోపాల్ వర్మకు పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య జరుగుతున్న వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ అభిమానులను గిల్లి వారితో తిట్టించుకోవడం వర్మకు అలవాటులా మరిపోయింది. ఇటీవల ‘పవర్ స్టార్’ సినిమా ప్రకటించిన దగ్గరనుంచి పవన్ ఫ్యాన్స్ వర్మ పై ఫైర్‌ అవుతున్నారు. ఆ కసితోనే వర్మ పై ‘పరాన్నజీవి’ అనే సినిమా తీశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా వర్మ తన ‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. దానికి సమాధానంగా ‘పరాన్నజీవి’ ఫస్ట్‌లుక్ ను రిలీజ్‌ చేశారు పవన్ ఫ్యాన్స్‌. ఈ సినిమాల్లో షకలక శంకర్ వర్మగా నటిస్తున్నాడు. పోస్టర్ లో శంకర్ ఓ అమ్మాయి తొడలపై క్లోజ్ షాట్ పెడుతున్నట్లు వర్మ శైలిలో డిజైన్ చేశారు. ఇక ”పవర్ స్టార్” సినిమాని జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేస్తునట్లు వర్మ ప్రకటించాడు. “పరాన్నజీవి” చిత్రాన్ని కూడా అదే రోజు అదే సమయానికి రిలీజ్ చేస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu