HomeTelugu Trendingఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల

ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల

Pavala syamala in financial
టాలీవుడ్‌ లేడీ కమెడియన్ పావలా శ్యామల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్‌ హోటల్‌, గోలీమార్‌ వంటి సూపర్‌ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల. శ్యామల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న నటి కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu