HomeTelugu Trendingపెళ్లి పీటలు ఎక్కబోతున్న సునీల్‌ హీరోయిన్‌..

పెళ్లి పీటలు ఎక్కబోతున్న సునీల్‌ హీరోయిన్‌..

7 1
టాలీవుడ్‌ నటుడు సునీల్‌ హీరోగా నటించిన ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మలయాళ నటి మియా జార్జ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వారి నిశ్చితార్థం జరిగిపోయిందని మలయాళ మీడియా ఖరారు చేసింది. ప్రస్తుతం కరోనా కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా వీరి నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు. నిజానికి కేరళలోని కొట్టాయంలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించడానికి మియా, అశ్విన్ కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారట. కానీ, కరోనా ఆ ప్రణాళికలను నాశనం చేసింది. దీంతో ఎంగేజ్‌మెంట్‌ను సింపుల్‌గా జరుపుకోవాల్సి వచ్చిందట.

మియా, అశ్విన్‌ల పెళ్లికి సెప్టెంబర్‌లో ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి తేదీని ఇరు కుటుంబాలు ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ కుటుంబంలోని కొంత మంది ద్వారా ఈ విషయం బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ టైమ్‌ కరోనా పోతే పెళ్లి వేడుక చాలా గ్రాండ్‌గా ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారట. తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మాపై చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు ధన్యవాదాలు’ అని ఈ పోస్ట్‌లో రాశారు. కాగా మియా మలయాళ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!