పవన్ సినిమా ఆలస్యమవుతుందా..?

pawan1

 

పవన్ కల్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బార్ సింగ్’ సినిమా ఇటీవల విడుదలయిన సంగతి
తెలిసిందే. ఈ సినిమా తరువాత పవన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడని ప్రతి ఒక్కరూ
భావించారు. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే కొత్త సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు పవన్.
ఎస్.జె.సూర్య డైరెక్ట్ చేయాల్సిన ఈ సినిమా నుండి ఆయన తప్పుకోవడంతో డాలీ వచ్చి చేరాడు.
సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు పవన్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. మరో మూడు
నెలల్లో సినిమా రిలీజ్ అవుతుందని పవన్ అభిమానులు భావించారు. అయితే నిన్ననే
తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడిన పవన్, వచ్చే నెలలో కాకినాడ లో కూడా
బహిరంగ సభ ఏర్పాటు చేయానున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటన చేయనున్నారు. కాబట్టి
వచ్చే నెలలో ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో
సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.