
Mahesh Babu – Vishnuvardhan:
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎక్కువగా చెన్నైలోనే చదువుకున్న విషయం చాలా మందికి తెలియదు. మహేష్ బాబు, రానా, రామ్ చరణ్, మంచు బ్రదర్స్ లాంటి నెపో కిడ్స్ అందరూ చెన్నైలో స్కూలింగ్ పూర్తిచేశారు. ఇక అక్కడ స్కూల్, కాలేజీలలో చేసిన స్నేహాలు ఇప్పటికీ హీరోలు గుర్తు చేసుకుంటూ ఉంటారు.
మహేష్ బాబు కూడా చెన్నైలోనే చదివాడు. ఆయన క్లాస్‌మేట్‌గా తమిళ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ విష్ణువర్ధన్ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు విష్ణువర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ‘పంజా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విష్ణువర్ధన్ మహేష్‌తో తన స్కూల్ డేస్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ‘‘మేము కేవలం క్లాస్‌మేట్స్ మాత్రమే కాదు, బెంచ్‌మేట్స్ కూడా. చాలా అల్లరి చేసేవాళ్లం. ఓసారి ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయని వార్త వచ్చింది. వెంటనే మహేష్‌తో కలిసి 500 రూపాయలకి పేపర్స్ కొనుక్కున్నాం. కానీ అవి ఫేక్ అని తెలిసి, చదువుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నాం’’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB 29’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్ ఈ సినిమాతో ఏ రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.