HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌- రానా మూవీ స్పెషల్‌ మీడియో

పవన్‌ కళ్యాణ్‌- రానా మూవీ స్పెషల్‌ మీడియో

Pawan kalyan and rana movie

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ -రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూట్‌ తాజాగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా సెట్స్‌లో జరుగుతున్న షూటింగ్‌ విశేషాలతో కూడిన ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో పవన్‌-రానాలపై యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. రానా పేరేంటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్ ఈ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఆద్యంతం అభిమానులను అలరించేలా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu