గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్‌ కల్యాణ్

గాజువాక ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటిది.. అటువంటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు జనసేన అధినేత, గాజువాక జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్. గాజువాకలో ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన పవన్‌… అనంతరం మాట్లాడుతూ… గాజువాక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ సమస్యలపై ఏ రాజకీయ పార్టీలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇక్కడి నుంచి బరిలోకి దిగానని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిలబెట్టామని.. క్రిమినల్ పొలిటీషియన్లపై యుద్ధానికి జేడీ లక్ష్మీనారాయణ బరిలో దించామని వెల్లడించారు పవన్ కల్యాణ్‌.