
Pawan Kalyan Remuneration for Hari Hara Veera Mallu
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ‘హరిహర వీర మల్లు’ అనే సినిమా కోసం ఆయన చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట. సాధారణంగా పవన్ డేకు రూ.2 కోట్లు తీసుకుంటారట షూటింగ్‌కు. కానీ ఈ ప్రాజెక్ట్‌కి మొత్తం రూ.11 కోట్లు మాత్రమే తీసుకున్నారని సమాచారం.
అదీ కాకుండా, మొదట రూ.10 కోట్లు ఇచ్చిన నిర్మాత, తర్వాత అదనంగా రూ.1 కోట్లు ఇచ్చాడట. ఇంతకీ మిగతా డబ్బు అడగలేదట పవన్. ఎందుకంటే నిర్మాత ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. పవన్ అయితే చాలా సింపుల్‌గా, “ఇవే సరిపోతాయి” అని చెప్పేశాడట.
ఇది వింటే చాలా మందికి షాక్ ఇచ్చే విషయం. ఎందుకంటే మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఫీజులు తగ్గించుకోవడం చాలా అరుదు. కానీ పవన్ మాత్రం నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకొని, ఒక్క మాట కూడా లేకుండా కమిట్‌మెంట్ చూపించాడట. ఇది ఆయనలోని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.
ఇంకా టాక్ ప్రకారం, నిర్మాతకు కృతజ్ఞతగా సినిమా ప్రమోషన్స్‌కి బాగా ఖర్చు పెడుతున్నాడట. అలాగే సినిమా హిట్ అయితే, లాభాల్లో కొంత షేర్ ఇవ్వాలని కూడా చర్చలు జరుగుతున్నాయట.
ఇలా చూస్తే, పవన్ కళ్యాణ్ చూపించిన స్పందన, ఓ పెద్ద స్టార్ నుంచి రావడం నిజంగా అభినందనీయమైన విషయం. రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా సినిమా టీమ్‌కి అండగా నిలబడడం గొప్ప విషయం.
పవన్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని అభిమానులు, సినీ వర్గాలు అంటున్నాయి.
ALSO READ: Nani Hit 3 OTT లో ఎప్పటినుండి స్ట్రీమ్ అవుతుంది అంటే..