HomeTelugu Big Storiesమరోసారి పవర్ ఫుల్ పోలీస్ గా పవన్...!

మరోసారి పవర్ ఫుల్ పోలీస్ గా పవన్…!

Pawan Kalyan

అటు రాజకీయాలు ఇటు సినిమాలు పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు .. ప్రస్తుతం హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నారు. భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన సినిమాల ఎంపిక తడబడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నారు. దానికి రీమేక్స్ సరైన మార్గంగా ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ తేరి తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో హీరో ఆఫీసర్ గా ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ కథ పవన్ కి బాగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తేరి రీమేక్ చేస్తే గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ పడుతుందంటున్నారు. కాగా ఈ చిత్ర రీమేక్ కి సర్వం సిద్దమవుతుందట. దర్శకుడు సుజీత్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. డివివి దానయ్య నిర్మాతగా ఈ క్రేజీ రీమేక్ పట్టాలెక్కనుందనేది టాలీవుడ్ టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu