HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌- అఖిరా ఫొటోలు వైరల్‌

పవన్‌ కళ్యాణ్‌- అఖిరా ఫొటోలు వైరల్‌

Pawan kalyan latest photos
పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ కొడుకు అఖిరానంద్‌కి గురించి అందరికీ తెలిసిందే. తాజాగా పవన్‌ కళ్యాణ్‌, అఖిరా ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. రేణూదేశాయ్‌తో విడిపోయినప్పటికీ పిల్లలు అఖిరా, ఆద్యల్ని తరచూ పవన్ కళ్యాణ్ కలుస్తుంటారు . తాజాగా మరోసారి పవన్-అకిరా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Pawan kalyant photos 2

ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ పక్కన అఖిరా ఆరగుగుల బుల్లెట్ మాదిరిగా ఉన్నాడు. తండ్రిపక్కన ఎంతో వినయంగా కనిపించి అకిరానందన్ పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్ని ఫిదా చేశాడు. ఒక ప్రముఖ సంగీత కళాకారిణి వద్ద అకిరా నందన్ వయోలిన్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కొడుకుతో పాటు పవన్ కూడా చిన్నపాటి సంగీత పాఠాలు విన్నారట. ఆయన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటూ.. పవన్ కళ్యాణ్ అతని తనయుడు అకిరా తన వద్ద సంగీతం నేర్చుకుంటూ తనకి శిష్యులు కావడం చాలా ఆనందంగా ఉందని.. ఈరోజు వాళ్లకి డెమో క్లాస్ ఇవ్వడం జరిగిందని.. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే క్లాస్‌ ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో కొన్ని గంటల పాటు మాట్లాడే అవకాశం లభించిందని.. ఆయన వయొలిన్ బాగా వాయిస్తారని నా డెమో క్లాస్ కూడా ఆయనకు నచ్చింది అంటూ సంగీత టీచర్ ఆనందం వ్యక్తం చేశారు. అఖిరా హీరోగా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌ త్వరలోనే తమ ఆశ నిరవేరుతుందనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu