మహేష్‌బాబుకి కథ చెప్పిన పరశురామ్‌..!

యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు మహేష్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  ఇటీవల ‘మహర్షి’ చేసిన ఆయన, తదుపరి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. జూన్‌లో ఆ చిత్రం మొదలు కాబోతోంది. ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ సినిమా చేసే అవకాశాలున్నాయి. ‘గీత గోవిందం’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్న పరశురామ్‌… ఇటీవలే మహేష్‌కి చూచాయిగా కథ  వినిపించినట్టు తెలిసింది. అది నచ్చడంతో ఆయన, పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేయమన్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే అనిల్‌ రావిపూడితో సినిమా పూర్తయ్యాక, పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటించే అవకాశాలు  కనిపిస్తున్నాయి. పరశురామ్‌ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ రూ.వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించింది.