బీఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తా: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తామని తెలిపారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వెళ్లిన పవన్‌.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని పవన్‌ అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి వెళ్తామని ఇదివరకే పవన్‌ ప్రకటించిన విషయంతెలిసిందే. తాజాగా బీఎస్పీతోనూ కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తున్నట్టు చెప్పారు.