HomeTelugu Trending3జీ, 4జీ, 5జీ.. అర్థం చెప్పిన అమితాబ్

3జీ, 4జీ, 5జీ.. అర్థం చెప్పిన అమితాబ్

7 2770 ఏళ్ల వయస్సులోను సోషల్ మీడియాలో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఎంత చురుగ్గా ఉంటారు. వ్యక్తిగత విశేషాలు, తన సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు, సామాజిక అంశాలపై తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి ఆయన చేసిన సరదా ట్వీట్‌ ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం 3జీ, 4జీ నెట్‌వర్క్‌లను ఉద్దేశిస్తూ ఆయన ‘ మా చిన్నతనంలో 3జీ, 4జీ, 5జీ ఏమి లేవు, కేవలం గురు’జీ’, పితా’జీ’, మాతా’జీ’ మాత్రమే ఉండేవారు. కేవలం ఒకే చెంపదెబ్బతో నెట్‌వర్క్‌ వచ్చేది’ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు.

ఇది పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు చిన్నతనం అలా గడిచిపోయింది సార్‌ ఈ ట్వీట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు, వాటితో పాటు పార్లే’జీ’ కూడ ఉంది సార్‌ అని సరదా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అమితాబ్, చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతోపాటు అమితాబ్ బ్రహ్మస్త్ర, గులాబో సితాబో, చెహ్రి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలు గాను అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu