HomeTelugu Trendingఓజీ: సెప్టెండర్‌2న అగ్ని తుఫాను రాబోతోంది

ఓజీ: సెప్టెండర్‌2న అగ్ని తుఫాను రాబోతోంది

pawan kalyan og movie updat

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాకి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుండి ఆసక్తికర అప్‌డేట్ విడుదలైంది. సెప్టెంబర్ 2న అగ్ని తుఫాను రాబోతోందంటూ ఈ రోజు చిత్ర బృందం ఓ పోస్టర్‌‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో అర్ధరాత్రి సమయంలో విలన్లను ఊచకోత కోసి తన అనుచరులతో హీరో వెళ్తున్న ఫొటోతో కూడిన పోస్టర్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

పోస్టర్‌‌లో ఓ చోట ‘లొకేషన్ చర్చి గేట్ సౌత్ బొంబాయి. టైమ్ ఉద‌యం 2 :18, వర్షపాతం సాంద్రత 24 మి.మీ, రక్తపాతం సాంద్రత 34 మి.మీ. వాడిన ఆయుధాలు : డబుల్ బారెల్ షాట్‌గన్’ అని రాసి ఉంది. ఈ పోస్టర్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. అగ్ని తుఫాను సెప్టెంబర్ 2న వస్తోంది.

ఓజీ అభిమానులారా ధైర్యంగా ఉండండి’ అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 2న పవన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓజీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్‌‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తుండగా. శ్రియా కీలక పాత్రలో నటిస్తోంది.

20230810fr64d49f011b0b0

Recent Articles English

Gallery

Recent Articles Telugu