HomeTelugu Big StoriesPawan Kalyan OG రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. న్యూపోస్టర్ వైరల్

Pawan Kalyan OG రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. న్యూపోస్టర్ వైరల్

Power star pawan kalyan OGPawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం OG. సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఈ మూవీలో పవన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్నాడు.

పవన్‌ కళ్యాన్‌ ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే మరోపక్క ఈ సినిమాను పూర్తిచేస్తున్నాడు. దాదాపు 70 % వరకు షూటింగ్ ను ఫినిష్ చేశారు. మధ్యలో పవన్ ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో కొంత బ్రేక్ ఇచ్చాడు.

తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27 న OG ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దీంతో పాటు కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్‌ లుక్‌ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu