HomeTelugu Trending'పింక్‌' కోసం పవన్‌ కళ్యాణ్‌ కాల్షీట్‌.. ఎన్ని రోజులో తెలుసా.!

‘పింక్‌’ కోసం పవన్‌ కళ్యాణ్‌ కాల్షీట్‌.. ఎన్ని రోజులో తెలుసా.!

2 17
బాలీవుడ్ లో మెగాస్టార్‌ అమితాబ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం పింక్. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాను సౌత్ లో తమిళంలో ఇప్పటికే అజిత్ తో నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అమితాబ్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఎన్నో రోజులుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ, పవన్ మాత్రం సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా లేనని చెప్పినా.. ఎట్టకేలకు నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ లు ఈ సినిమా కోసం పవన్‌ను ఒప్పించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొత్తం 21 రోజుల కాల్షీట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ 21 రోజుల్లో తనకు సంబంధించిన పార్ట్ ను కంప్లీట్ చేయాలని యూనిట్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన కాల్షీట్స్ ప్రకారం సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేత, అనన్యలు ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu