మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో ‘చిత్రలహరి’ సినిమా చేస్తున్నాడు. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలౌతుంది. పరాజయాలతో సతమతమౌతున్న ఈ హీరోకు పవన్‌ చేయూతనిస్తున్నాడని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమా తరువాత ఏఎం రత్నం మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ, అప్పట్లో కుదరలేదు. తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లో బిజీఅయ్యారు. ఏఎం రత్నం పవన్ తో చేయాలని అనుకున్న సినిమాకు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను రిఫర్ చేశారట పవన్. ఏ ఎం రత్నం కూడా అందుకు అంగీకరించారని సమాచారం. వీరి సినిమా ఎప్పుడు ఉంటుంది. ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయాలు తెలియాలి.