HomeTelugu Trendingమరోసారి పవన్‌ కల్యాణ్‌తో కాజల్‌ రొమాన్స్‌!

మరోసారి పవన్‌ కల్యాణ్‌తో కాజల్‌ రొమాన్స్‌!

4 11
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తరువాత క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో వకీల్ సాబ్, క్రిష్ మూవీల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇక హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ , కాజల్ కలిసి సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన విషయం తెలిసందే. ఈ వార్తలపై ఇంక క్లారిటీ రావాల్సి ఉంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu