జ‌న‌సేన అభ్యర్ధి ఇంట్లో విందు చేసిన పవన్..

గుంటూరు జిల్లా ప‌ర్యట‌న‌లో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్… గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన షేక్ జియా ఉర్ రెహ్మాన్ ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా రెహ్మాన్ త‌ల్లి.. ఇస్లాం మ‌త గ్రంథాన్ని చ‌దివి వినిపించ‌గా, జనసేనాని పరవశించిపోయి.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోపాలో కూర్చొని గ్రంథాన్ని చదివి వినిపిస్తుండగా… నేలపై కూర్చున్న పవన్.. ఆమె చేతికి ఆప్యాయంగా ముద్దులు పెట్టారు. ఆమె పాదాలకు వందనం చేశారు. ఇక రెహ్మాన్ ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.