HomeTelugu Trendingపవన్ కల్యాణ్‌ ఎంట్రీ ఫైట్‌ సీన్‌ తోనేనట!

పవన్ కల్యాణ్‌ ఎంట్రీ ఫైట్‌ సీన్‌ తోనేనట!

1 14
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆయన సెట్స్ పైకి వచ్చే సమయం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ప్లాన్ చేసినట్టు సమాచారం. పవన్ కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.

ముఖ్యంగా పవన్ కల్యాణ్ తదితరులపై ఫైట్ సీన్ తో మొదటి షెడ్యూల్ ను ఆరంభించనున్నారు. సినిమాలో ఈ ఫైట్ సీన్ తోనే పవన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ యాక్షన్ సీన్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలోనూ ఆయన మార్పులు చేశాడని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu