HomeTelugu Newsఅభిమానులకు పవన్‌ కళ్యాణ్‌ భారీ సాయం

అభిమానులకు పవన్‌ కళ్యాణ్‌ భారీ సాయం

14 1పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనలోని సేవా భావాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా కష్టంలో ఉన్నాం అంటూ తన వద్దకు వస్తే వీలైనంత సహాయం చేస్తుంటారు పవన్. ఇప్పటికే సినీ పరిశ్రమలోని వ్యక్తులు, బయటి వ్యక్తులు, తన పార్టీ వ్యక్తులు అనేకమందికి సహాయపడిన ఆయన తాజాగా కూడా ఇద్దరు అభిమానులకు ధన సహాయం చేశారు.

విజయనగరం జిల్లాకు చెందిన విశ్వతేజ అనే కార్యకర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని పార్టీ వ్యక్తుల ద్వారా తెలుసుకున్న పవన్ వెంటనే వైద్య ఖర్చుల నిమిత్తం అతనికి రెండు లక్షల రూపాయల చెక్ పంపారు. అలాగే అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ఖమ్మం జిల్లాకు చెందిన గుబ్బాల సతీష్ అనే యువకుడికి కూడా తన సిబ్బంది ద్వారా లక్ష రూపాయల చెక్ అందజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu