HomeTelugu Trendingయాక్షన్ క్వీన్‌గా పాయల్ రాజ్‌పుత్

యాక్షన్ క్వీన్‌గా పాయల్ రాజ్‌పుత్

2 2

పాయల్ రాజ్‌పుత్ అంటేనే కుర్రకారుకి ఆర్‌ఎక్స్‌ 100 గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టేసింది పాయల్. తన బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్ల హృదయాలను దడదడలాడించిన పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు యాక్షన్‌ క్వీన్‌గా మారబోతుంది. హాట్‌ భామగా పేరుతెచ్చుకున్న ఈమె తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో హాట్ భామగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్‌లో ఫైట్లు చేసిన పాయల్, డిస్కో రాజాలో మూగ చెవిటిగా నటించింది. ఇప్పుడు యాక్షన్ స్టార్‌గా మారబోతుంది. ఒక్కో సినిమాలో ఒక్కో ఇమేజ్‌ను తెచ్చుకుంటూ గ్లామర్ ఇమేజ్‌ను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ పక్కనపెట్టి కొత్తగా ప్రయత్నిస్తోంది. పరాంజీ దర్శకత్వంలోని నరేంద్ర అనే సినిమాలో ఫైటర్ పైలట్‌గా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu