HomeTelugu Trendingవిస్కీ తాగుతూ ఫోజ్‌ ఇచ్చిన పాయల్‌!

విస్కీ తాగుతూ ఫోజ్‌ ఇచ్చిన పాయల్‌!

payal rajput with whisky bo

పాయ‌ల్ రాజ్‌పుత్ తాజాగా సోషల్‌ మీడియాలో మందుగ్లాసు ప‌ట్టుకున్న ఫొటో షేర్‌ చేసింది. అయితే ఈ బ్యూటీ తాగ‌డం ఎప్పుడు మొద‌లు పెట్టింది అని ఆమె అభిమానులు కొంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే అలాంటిదేమీ లేదు. ఆమె ముందు ఓ ప్ర‌ముఖ బ్రాండ్‌కు చెందిన‌ విస్కీ బాటిల్ ఉండ‌గా, దాన్ని గ్లాసులో ఒలికించి చేత ప‌ట్టుకుని సౌమ్యంగా న‌వ్వులు చిందిస్తోంది. అంటే ఆమె స‌ద‌రు విస్కీ బ్రాండ్ యాడ్ కోస‌మే అలా చేసిందని సులువుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలంగాణ‌లో ఈ కొత్త బ్రాండు భ‌లే బాగుందంటూ ప్ర‌మోట్ చేసింది. కాగా తెలుగులో హీరోలు సందీప్ కిష‌న్‌, నిఖిల్ మందు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేశారు కానీ ఓ హీరోయిన్ ఇలా ధైర్యం చేసి ముందుకు రావ‌డం చాలా అరుదు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu