HomeTelugu News'నాకూ ఐ ఫోన్‌ అంటేనే ఇష్టం' : నాని

‘నాకూ ఐ ఫోన్‌ అంటేనే ఇష్టం’ : నాని

నేచరల్‌ స్టార్‌ నాని..బులితెరపై ‘బిగ్‌బాస్‌-2’ కు షోస్ట్‌ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం విజయవంతంగా ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారం ఎలిమినేషన్‌ రౌండ్‌లో సంజన ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. అనంతరం ఓ వెబ్‌ చానల్‌కు ఇంటర్యూ ఇస్తూ నాని గురించి వివాదాస్పదంగా మాట్లాడింది. ‘యాంకరింగ్‌ విషయంలో ఎన్టీయార్‌ ఐఫోన్‌ అయితే..నాని చైనా ఫోన్‌. ఒక్కసారి ఐఫోన్‌ వాడక వేరేవి ఎవరికీ నచ్చవు. నాకు అంతే’ అంటూ నాని ని విమర్శంచింది. నాని పై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

7 11

దీంతో ఓ నెటిజన్‌ సంజన చేసిన ఈ వ్యాఖ్యల గురించి నానికి ట్వీట్‌ చేశాడు. దీనికి స్పందించిన నాని ‘నాకూ ఐ ఫోన్‌ అంటేనే ఇష్టం’ అని ట్వీట్‌ చేశాడు. నాని హుందాగా స్పందిన తీరుకు నెటిజన్లు అభినందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu