Homeతెలుగు వెర్షన్ప్చ్.. అడ్డంగా దొరికాక సాధికారత గుర్తుకొచ్చిందా ?

ప్చ్.. అడ్డంగా దొరికాక సాధికారత గుర్తుకొచ్చిందా ?

Pch.. Did you remember the empowerment when you found the cross

కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందా?, లేక ఎవరైనా ఆమెను ఇరికించారా ? అనేది ఆమెకే తెలియాలి. ఏది ఏమైనా తప్పు అలవాటుగా చేసినా, పొరపాటుగా చేసినా అది తప్పే. అలాంటి తప్పు నుంచి తెలివిగా బయట పడటానికి కవిత ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. తన పై అవినీతి ఆరోపణల్లో వాస్తవం ఎంత అని రుజువు అవుతున్న క్రమంలో ఇలా కవిత టాపిక్ డైవర్ట్ చేయడానికి సరికొత్త కార్యక్రమాలు పెట్టుకున్నట్లు ఉంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత చేస్తున్న డిమాండ్ ను తెలంగాణ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేదే ఇక్కడ పాయింట్. ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో కవిత పై ఓ స్పష్టమైన అవగాహన వచ్చేసింది. ఆమె అవినీతిలో భాగం అయ్యింది అని టాక్ నడుస్తోంది. ఇవన్నీ ప్రజలు త్వరగా మర్చిపోవాలి అని ఢిల్లీలో కూడా కవిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది..

మరోవైపు లిక్కర్ స్కాం పై కేంద్రం సీరియస్ గా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసమే కావొచ్చు. కానీ కవిత తప్పు చేసి దొరికింది. కాబట్టి, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టకూడదు అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకే కవిత ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు రెడీ అయింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని తమతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని కవిత పట్టుదలగా ఉంది. ఎంత విచిత్రం.. లిక్కర్ స్కాంలో మీరు ఉన్నారో లేదో తేలకుండానే ఇలా ఉద్యమం చేయడం ఏమిటి కవిత గారు ?.

అయినా, మీరు స్కాం చేసి దొరికిపోయ్యాక, ఈ రోజు మీకు మహిళలకు సాధికారత గుర్తుకు వచ్చిందా ?, ఒక మహిళ అయ్యి ఉండి, లిక్కర్ స్కాంలో భాగం కావడానికి మీకు సిగ్గు లేదా ?, మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి అంటూ కొత్తగా మీరు నినాదం అందుకున్నారు. మంచిది. కానీ అంతకంటే ముందు.. లిక్కర్ స్కాం లో మీకు ఎన్ని కోట్లు వచ్చాయి ?, ఆ డబ్బు లైగర్ సినిమా వైపు తరలించారా ? లేదా ? లాంటి విషయాల పై కూడా మీరు నోరు విప్పితే.. తెలంగాణ సమాజం మీ పై ఓ అవగాహనకు వస్తోంది. మరి మీరు ఓపెన్ అవుతారా ? కవితగారు!!.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!