
Aamir Khan Underworld Story:
బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్‌కి 1990లలో ఎదురైన భయానక అనుభవం గురించి ఇప్పుడు బయట పెట్టాడు. అప్పటి కాలంలో బాలీవుడ్ మీద మాఫియా గ్యాంగ్‌ల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. వారు డబ్బు పెట్టి సినిమాలు తీయించేవారు, కానీ బదులుగా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వారి మాట విని పనిచేయాలని ఒత్తిడి పెట్టేవారు.
ఈ నేపథ్యంలో, ఆమిర్ ఖాన్‌కి కూడా మాఫియా వాళ్లు డైరెక్ట్‌గా అటెంప్ట్ చేశారు. లల్లన్‌టాప్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రకారం — ఒకరోజు కొంతమంది మాఫియా వ్యక్తులు వచ్చి, దుబాయ్ లేక షార్జా లో జరిగే ఓ పార్టీకి రావాలంటూ ఆహ్వానించారు. మొదట ఆయన ఒప్పుకోలేదు. కానీ వారు చాలాసార్లు వచ్చి డబ్బు, ఫేవర్ లు వాగ్దానం చేస్తూ ఒప్పించడానికి ట్రై చేశారు.
చివరకి – “మీ పేరును పార్టీకి అనౌన్స్ చేశాం, ఇప్పుడు తప్పక రావాల్సిందే. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయం” అని బెదిరించారని తెలిపారు. అయినా కూడా ఆమిర్ చెప్పిన మాటలు వినండి – “మీరు బలవంతంగా నన్ను కొట్టి, కాళ్లు కట్టేసి తీసుకెళ్లవచ్చు. కానీ నా ఇష్టంతో నేను వెళ్లను” అన్నాడు.
తరువాత వారు మళ్లీ కలవలేదు. ఆమిర్ చెప్పినట్లుగా, అతనికి తన కుటుంబం గురించి భయం వేసిందని చెప్పాడు – అప్పట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అయినా సరే, తన విలువలు, వ్యక్తిత్వానికి మించి ఏదీ లేదని తేల్చేసాడు.