HomeTelugu Trending'పెదకాపు 1' ఫస్ట్‌లుక్‌

‘పెదకాపు 1’ ఫస్ట్‌లుక్‌

Pedda Kapu 1 first look
డైరెక్టర్‌ శ్రీకాంత్ అడ్డాల.. చాలా గ్యాప్ తరువాత ‘అఖండ’ టీమ్ తో సినిమా చేస్తున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మిర్యాల రవీందర్ రెడ్డి తన ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రమే ‘పెదకాపు 1’. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాతో రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా విడుదలైన ‘పెదకాపు 1’ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక ఇందులో విరాట్ కర్ణ మాస్ లుక్ తో దర్శనమిచ్చాడు. అంతేకాదు అతడు పల్లెటూరు లోని ఓ వర్గానికి లీడర్ గా నూ కనిపిస్తున్నాడు. అలాగే దీనిపై ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఇది ఆరంభం లోనే అందరి దృష్టి నీ ఆకర్షించింది. 90వ దశకం నాటి రాజకీయాలు, గొడవలు.. కులాల మధ్య చిచ్చుల వల్ల వచ్చే సమస్యల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయిందని తెలుస్తోంది.

ఇక దీని తో పాటు మరో బిగ్ అప్డేట్ ను కూడా వదలబోతున్నామని దాని కోసం వేచి చూడండి అంటూ మూవీ యూనిట్ వెల్లడించింది. సాధారణంగా శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు పల్లెటూరి ప్రాంతాల్లో కనిపించే ఎన్నో సున్నిత మైన అంశాల ను టచ్ చేసే విధంగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు క్యాస్ట్ కాంట్రవర్శీతో రాబోతున్న ఈ చిత్రంలో ఆయన ఎన్నో వివాదాస్పద అంశాల ను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu