HomeTelugu Newsపీప్ షో: టీజర్‌

పీప్ షో: టీజర్‌

Peep Show Movie Teaser

సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ… యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ డైరెక్షన్‌లో అమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘పీప్ షో’. దొంగచాటుగా తొంగిచూడడాన్ని ‘పీప్ షో’ అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.

జబర్దస్త్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న ‘పీప్ షో’. ఈ సినిమాకి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్.కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పీప్ షో” చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్. “పీప్ షో” చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu