‘పెళ్లి చేసుకోను’ అంటోన్న ప్రేమమ్ బ్యూటీ!

మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది సాయిపల్లవి. 
అభిమానులు ఆమెను ముద్దుగా మలార్ అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో 
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే సినిమాలో నటిస్తోంది. టెక్నాలజీ పెరిగిన తరువాత 
హీరో, హీరోయిన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా 
సాయి పల్లవి కూడా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో కొందరు 
అభిమానుల అడిగిన ప్రశ్నలకు సాయి పల్లవి సంచలనమైన కామెంట్స్ చేసింది. సాధారణంగా 
వయసులో ఉండే అమ్మాయిలను అడిగే పెళ్లి ప్రశ్నే సాయి పల్లవికి కూడా ఎదురైంది. దీనికి 
ఆమె నేను అసలు పెళ్లి చేసుకోను అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దానికి కారణలు కూడా 
చెప్పుకొచ్చింది. జీవితాంతం నేను నా పేరెంట్స్ తో ఉంటూ.. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.. 
అందుకే నా లైఫ్ లో పెళ్లి అనే మాట వినిపించదు అని చెప్పుకొచ్చింది. మరి భవిష్యత్తులో ఆమె 
తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి!
 
 
CLICK HERE!! For the aha Latest Updates