జబర్దస్త్ క‌మెడియ‌న్ న‌రేష్‌ పై దాడి.. కారణం ఇదేనా!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో అంటే న‌వ్వుల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ కాంట్ర‌వ‌ర్సీ కూడా బాగానే వ‌స్తుంటుంది. ఇప్పుడు కూడా ఇందులో ఉన్న ఓ పార్టిసిపెంట్‌పై దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. ఈటీవీ ఢీ షో నుంచి వ‌చ్చి.. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో ర‌ప్ఫాడిస్తున్న యువ క‌మెడియ‌న్ న‌రేష్‌పై ఇప్పుడు దాడి జరిగింది. నాటీ న‌రేష్‌గా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఈ కుర్రాడు. చూడ్డానికి మిర‌ప‌కాయ్‌లా ఉన్నా కూడా ఆయ‌న కామెడీ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఈయ‌న‌పై దాడి జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం అయిపోయింది.

చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉండే న‌రేష్ ను ఎందుకు టార్గెట్ చేసార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌బ‌ర్ద‌స్త్ తో పాటు బ‌య‌టి కార్యక్రమాలు, ఈవెంట్స్ కూడా చేస్తుంటాడు న‌రేష్. ఆయ‌న‌తో పాటే టీం కూడా ఉంటుంది. ఈ సంద‌ర్భంగానే తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి శ్రీకాకుళం వెళ్లారు న‌రేష్‌ టీం. అక్క‌డే ఉండి స్కిట్స్ కూడా పూర్తి చేసారు. అయితే మేక‌ప్ వేసుకుంటున్న స‌మ‌యంలో కొంద‌రు ఆక‌తాయీలు న‌రేష్ టీంను ఇబ్బంది పెట్టార‌ని తెలుస్తుంది.

అదే స‌మ‌యంలో ఇరు వ‌ర్గాల‌కు చిన్న గొడ‌వ కూడా జ‌రిగింద‌న వార్త‌లు వినిపిస్తున్నాయి. దాన్ని మ‌న‌సులో పెట్టుకుని స్కిట్స్ పూర్తి చేసుకుని వెళ్తున్న న‌రేష్ అండ్ టీంపై దాడి చేసార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వ్య‌వ‌హారం పోలీసుల వ‌ర‌కు వెళ్లింది. ఇలా జ‌బ‌ర్ద‌స్త్ కమెడియ‌న్ల‌పై గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు.. గ‌తంలో కూడా ఇదే జ‌రిగింది. ఇప్పుడు కూడా మ‌రోసారి జ‌గ‌ర‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ యాజ‌మాన్యం కూడా సీరియ‌స్ అవుతున్నారు. మ‌రి ఇది ఎక్క‌డ ముగుస్తుందో చూడాలి.