HomeTelugu Trendingపర్‌ఫ్యూమ్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల

పర్‌ఫ్యూమ్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల

Perfume Tittle Song

Perfume: చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి.స్వామి దర్శకత్వంలో వచ్చిన చిత్రం పర్‌ఫ్యూమ్. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్ పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్‌లతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ మీద అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, భోళే షావలీ కలిసి రిలీజ్ చేశారు.

ఈ టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పర్‌ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేశారు. సురేష్ గంగుల ఈ పాటకు సాహిత్యాం అందించగా.. వరం, కీర్తన శర్మ ఆలపించారు. ఈ పాటను భీమ్స్, భోళే షావలీ కలిసి రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ పాట ఫుల్ క్రేజీగా కనిపిస్తోంది. శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా అనిపిస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu