HomeTelugu Trending'తండేల్‌' ఫస్ట్‌ గ్లింప్స్‌

‘తండేల్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌

Essence of Thandel movie

అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు టాక్.

ఈ సినిమాలో చైతూ మత్సకారుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. 2 నిమిషాల 11 సెకన్లపాటు సాగిన ఈ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఇంటెన్సివ్‌గా ఉన్నాయి.

బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లిన నాగ చైతన్య‌ సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అయితే పాకిస్థాన్ జైలు నుంచి అత‌డు ఎలా బయటపడ్డాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది.శ్రీకాకుళం యాసలో నాగ చైతన్య డైలాగ్స్ బాగున్నాయి.

ఈ వీడియోలో నాగచైతన్య-సాయి పల్లవి లుక్‌ ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింతగా హైప్ ఇచ్చింది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తండేల్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu