పెథాయ్‌ తుఫాను తీరాన్ని తాకింది

కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్‌ తుఫాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి. ఇది ఏడు జిల్లాలపై ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తుఫాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలకు సెలవు ప్రకటించారు.